రోడ్డు ప్రమాదంలో 16 ఏళ్ళ బాలిక మృతి
- October 21, 2017
షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో 16 ఏళ్ళ బాలిక మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాండ్ క్రూయిజర్ వాహనాన్ని 42 ఏళ్ళ జోర్డానియన్ నడుపుతున్నారు. ఆ కారులో మరో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ ఉన్నపళంగా యూ టర్న్ తీసుకోవడంతో వాహనం కంట్రోల్ తప్పి ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో రక్తమోడిన బాలికను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే సంఘటనా స్థలానికి పోలీస్ పెట్రోల్స్ చేరుకున్నాయని, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించడం జరిగిందని రష్దియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ బిన్ సులేమాన్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







