రోడ్డు మీది క్రాష్ అయిన విమానం

- October 22, 2017 , by Maagulf
రోడ్డు మీది క్రాష్ అయిన విమానం

అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రెండు సీట్ల చిన్న విమానమొకటి నేరుగా ఓ వీధిలోకి దూసుకొచ్చి రెండు కార్లను ఢీ కొంది. ఈ ఘటనలో కార్లు నుజ్జునుజ్జు కాగా..ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్లేన్ హఠాత్తుగా నేల మీదికి దూసుకు రావడాన్ని దగ్గరలోని ఓ హెయిర్ స్టయిల్ స్టూడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు చేసి ఫుటేజీని ఈ నెల 20న తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇదో షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్ అంటూ కామెంట్ చేసింది. అటు- స్థానిక పోలీసులు కూడా ప్లేన్ క్రాష్ సైట్ వీడియోను పోస్ట్ చేయడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com