కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ వల్ల 5వేల మందికి ఉపాధి : మంత్రి కేటీఆర్
- October 22, 2017
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌లో పరిశ్రమల స్థాపనకు 23 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఒప్పందాలు కుదుర్చుకుంది. మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తొలిదశలో వరంగల్‌లో 14 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, ఇతర ప్రాంతాల్లో 8 పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో 5వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఫాం టు ఫ్యాషన్ స్లోగన్‌తో టెక్స్టైల్ పార్క్‌లో పనులు జరుగుతాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నేతన్నల నుంచి తయారీ, కొనుగోలు నేరుగా చేస్తున్నామని, టెక్స్టైల్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవబోతోందని, రకరకాల వస్త్ర ప్రదర్శనలకు వరంగల్ వేదిక కావాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







