మద్యం ఫ్యాక్టరీ పై దాడి : ఇద్దరు ప్రవాసీయులు అరెస్ట్
- October 22, 2017
కువైట్ : సాబహ్ అల్ అహ్మద్ ప్రాంతంలోని ఒక మద్యం కర్మాగారాన్ని పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ లో అధికారులు దాడులు జరిపి నిందితులను అరెస్టు చేశారు, ఆసియా దేశానికి చెందిన ఇరువురు ప్రవాసులు అరెస్టయ్యారు, మద్యంతో నింపిన 140 పీపాలు మరియు మద్యం తయారీ కోసం ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకొన్నారు.. పబ్లిక్ భద్రత వ్యవహారాల సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-త్రారా ఈ సందర్భంగా మాట్లాడుతూ సబహ్ అల్ అహ్మద్ ప్రాంతంలో ఇద్దరు ఆసియా ప్రవాసీయులు మద్యం చేస్తున్నారనే సమాచారం అందిందని దీంతో వీరిని పెట్టుకొనేందుకు ఒక ప్ర్రత్యేక భద్రతా బృందం ఏర్పడింది. వచ్చిన సమాచారంను నిర్ధారించుకొని , అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకున్న తర్వాత, ఫ్యాక్టరీ పై దాడి చేసి ఇద్దరు అనుమానితులను అదుపులోనికి తీసుకొని వారిని అదుపులోనికి తీసుకొన్నట్లు ఆయన తెలిపారు. మద్యం తయారీ గురించి ప్రశ్నించినప్పుడు, అనుమానితులు తాము స్థానికంగా తయారుచేసిన మద్యాన్ని తమ తమ కొనుగోలుదారులకు 8 నుంచి 10 కువైట్ దినార్ల ఖర్చుతో విక్రయించినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







