బీహార్‌లో యువతి పై గ్యాంగ్‌రేప్
- October 22, 2017
విధులు పూర్తి చేసుకొని ఆటోలో ఇంటికి వస్తున్న మహిళపై ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బీహార్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వైశాలీ జిల్లాలోని హజీపుర పట్టణానికి చెందిన ఓ మహిళ పాట్నాలోని ఓ హైకోర్టు న్యాయవాది ఇంట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి స్వగ్రామమైన హాజిపురకు ఆటోలో వెళ్తుండగా.. కేలా బజార్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశాకి రాగానే ఆటోడ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కలిసి ఆమె పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పర్యవసనాలు ఉంటాయని బెందిరించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







