అబుదాబిలో చంద్రబాబు మూడోరోజు పర్యటన

- October 23, 2017 , by Maagulf
అబుదాబిలో చంద్రబాబు మూడోరోజు పర్యటన

3రోజుల గల్ఫ్‌ దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు  చంద్రబాబు అబుదాబీలో పర్యటించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. గల్ఫ్ వాణిజ్య దిగ్గజం డాక్టర్ బీఆర్ షెట్టీతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. దీనికి పలువురు దిగ్గజాలు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను వారికి వివరించారు. విదేశీ పెట్టుబడలుతో వచ్చేవారికి రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. సన్‌ రైజ్‌ ఆఫ్‌ ఇండియాగా ఉన్న ఏపీలో వ్యాపారాలకు అత్యంత అనుకూల ప్రదేశామన్నారు. చంద్రబాబు ప్రజంటేషన్‌ పై గల్ఫ్‌ పారిశ్రామిక వేత్తులు ఆసక్తి చూపారు. పలువురు పెట్టుబడులకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు. 

అనంతరం యుఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అల్లుడు షేక్ హమీద్ బిన్ తహ్‌నౌన్ అల్ నహ్యాన్‌తో మర్యాదపూర్వక భేటీ అయ్యారు.  ఏపీలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెడితే అన్ని విధాలా సహకరిస్తామని ఆదేశ రాజ కుటుంబానికి తెలిపారు. ప్రవాసాంధ్రులపై కూడా ఆయనతో చర్చించారు. ఏపీలో పర్యటించాలని కోరారు.

అంతకుముందు అబుదాబీలోని పలు చారిత్రక ప్రదేశాలను చంద్రబాబు సందర్శించారు. ఇందులో భాగంగా షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును సందర్శించి ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు.  ఇక డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు. ఈ విజయంతో మన శ్రీకాంత్ సూపర్‌ హీరోగా నిలిచి చరిత్ర సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంశసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com