వరుసగా మూడోరోజూ తగ్గిన బంగారం ధర

- October 23, 2017 , by Maagulf
వరుసగా మూడోరోజూ తగ్గిన బంగారం ధర

వరుసగా మూడోరోజూ పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయ విపణిలో బులియన్‌ ధరలు రెండు వారాల కనిష్ఠస్థాయికి చేరడం, దేశీయంగా ఆభరణాల విక్రేతలు, కొనుగోలుదార్ల నుంచి గిరాకీ తగ్గడం ఇందుకు కారణమని చెబుతున్నారు. మేలిమి బంగారం (999 స్వచ్ఛత) 10 గ్రాముల ధర రూ.166 తగ్గి, రూ.29,555కు చేరింది. కిలో వెండి ధర రూ.391 తగ్గి, రూ.39,420కి పరిమితమైంది. ఇక అంతర్జాతీయ విపణిలో చూస్తే, డాలర్‌ బలపడటం వల్ల, పసిడికి గిరాకీ తగ్గింది. ఔన్సు (31.10 గ్రాములు) బంగారం 1273 డాలర్ల వద్ద ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com