యాదాద్రి-భువనగిరి జిల్లా వాసి వియత్నాం కాన్సిలేట్‌ జనరల్‌గా కొప్పుల శ్రీకర్‌రెడ్డి

- October 23, 2017 , by Maagulf
యాదాద్రి-భువనగిరి జిల్లా వాసి వియత్నాం కాన్సిలేట్‌ జనరల్‌గా కొప్పుల శ్రీకర్‌రెడ్డి

యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప గ్రామానికి చెందిన డాక్టర్‌ కొప్పుల శ్రీకర్‌రెడ్డి సోమవారం వియత్నాం పర్మినెంట్‌ మిషన్‌ ఆఫ్‌ ఇండియా కాన్సిలేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య బ్యాంక్‌ భారత ప్రతినిధిగా పనిచేస్తున్న ఆయన.. ఈ నెల 21న బదిలీ అయి..హోచ్‌మించ్‌లో నూతన బాధ్యతలు చేపట్టారు. గతంలో జర్మనీలోని భారత రాయబార కార్యాలయంలో మూడేళ్లపాటు పనిచేశారు. సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు అధికారిగా పనిచేసిన కాలంలో పలు సంస్కరణలు చేపట్టారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com