24 గంటలూ సన్నద్ధంగా ఉండాలని వాయుసేనకు అమెరికా ఆదేశాలు

- October 23, 2017 , by Maagulf
24 గంటలూ సన్నద్ధంగా ఉండాలని వాయుసేనకు అమెరికా ఆదేశాలు

ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేరు వింటేనే అమెరికా కలవరపాటుకు గురవుతున్నది. సోవియట్‌ రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత, తొలిసారి వాయుసేనను నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది. అణ్వాయుధాలు అమర్చిన యుద్ధ విమానాలు రోజులో 24 గంటలూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది. దీనికి సంబంధించిన ఆదేశాలు అధికారికంగా జారీ కాలేదు కానీ, అణు బాంబుల్ని సుదూర తీరాలకు మోసుకెళ్లి ప్రయోగించగల 'బీ-52' యుద్ధ విమానాల్ని అమెరికా రక్షణ శాఖ సన్నద్ధం చేసింది. 24 గంటలూ సన్నద్ధంగా ఉండాలని అమెరికా రక్షణ శాఖ నిర్ణయించటం సర్వత్రా సంచలనం రేపింది. ఇలాంటి స్థితి ఏర్పడటం, 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ఇదే తొలిసారి. 
'డిఫెన్స్‌ వన్‌' వెల్లడించిన వివరాల ప్రకారం అణ్వాయుధాలతో కూడిన అమెరికా యుద్ధ విమానాలు అనుక్షణంగా సంసిద్ధంగా ఉంటాయి, ఆదేశాలు జారీ అయిన మరుక్షణం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఉత్తర కొరియా అణ్వాయుధాలతో దూకుడు ప్రదర్శించడం, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోరాట దృక్పథాన్ని చూపిస్తుండటం, రష్యా సాయుధ దళాల క్రియాశీలత వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ సన్నాహాలను ఏదైనా ప్రత్యేక కార్యక్రమం కోసం చేయడం లేదని, అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా వాయు సేన చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ డేవిడ్‌ గోల్డ్‌ఫీన్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com