అబుదాబీలో సల్మాన్‌ఖాన్ 'భరత్' షూటింగ్
- October 24, 2017
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్, 2019 ఈద్ కోసం సినిమాని ఫిక్స్ చేసేశాడు. అదే 'భరత్'. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. ఇండియాలోని పంజాబ్, ఢిల్లీలతోపాటుగా 'భరత్' షూటింగ్, అబుదాబీలోనూ జరగబోతోంది. 2014లో వచ్చిన సౌత్ కొరియా సినిమా 'ఓడె టు మై ఫాదర్' సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అతుల్ అగ్నిహోత్రి ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించబోతున్నారు. కొరియన్ ఫిలిం నుంచి స్ఫూర్తి పొందినా, కథ - కథనాల అన్నీ 'భరత్'లో భిన్నంగా ఉంటాయని చెబుతున్నారు అతుల్. అబుదాబీలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించడంతోపాటుగా, ప్రత్యేకంగా కొన్ని సెట్స్‌ని కూడా అబుదాబీలో వేసి అక్కడ సినిమాని చిత్రీకరించనున్నట్లు తెలియవస్తోంది. సల్మాన్‌ఖాన్ సినిమాలకి గల్ఫ్ దేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గల్ఫ్ దేశాల్లో సల్మాన్ ఎప్పుడు పర్యటించినా, షూటింగ్‌ల నిమిత్తం ఎప్పుడు ఆయన గల్ఫ్ దేశాలకు వచ్చినా పెద్దయెత్తున ఆయనకు అభిమానుల నుంచి స్వాగతం లభిస్తుంటుంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







