జీఎస్టీపై కేంద్రం ప్రభుత్వం మరో సంచలన ప్రకటన

- October 24, 2017 , by Maagulf
జీఎస్టీపై కేంద్రం ప్రభుత్వం మరో సంచలన ప్రకటన

పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ ఊరట కల్పించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు గానూ గడువులోగా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారికి విధించిన జరిమానాను మాఫీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్నిఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ట్విటర్లో వెల్లడించారు. ''పన్ను చెల్లింపుదారులకు సులభంగా ఉండేలా ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు గానూ జీఎస్టీఆర్-3బీ ఫైలింగ్‌పై ఆలస్యపు రుసుమును మాఫీ చేశాం. చెల్లించిన లేట్ ఫీజులను పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో తిరిగి జమచేస్తాం..'' అని వెల్లడించారు.
వ్యాపారులు, జీఎస్టీ ఫైలింగ్ సిబ్బందికి ఇబ్బందులు లేకుండా... సజావుగా పన్నుచెల్లింపులు జరిగేందుకే కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. జీఎస్టీ అమల్లోకి తీసుకొచ్చిన మొదట్లో పెద్ద ఎత్తున సాంకేతిక సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు అక్టోబర్ 20 చివరితేదీ కాగా...

ఆ ఒక్కరోజు మధ్యాహ్నం సమయానికే 33 లక్షల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయి. గంటలకు 77 వేల సేల్స్ డేటా చొప్పున జీఎస్టీఎన్ పోర్టల్‌లో అప్‌లోడ్ అయినట్టు జీఎస్టీఎన్ నెట్‌వర్క్ చైర్మన్ అజయ్ భూషణ్ పాండే ఆరోజు పేర్కొన్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com