తెలంగాణలో త్వరలో 108 బైక్ సర్వీసు
- October 24, 2017
నగర గల్లీల్లోకి ప్రస్తుతం ఉన్న అంబులెన్సులు వేగంగా చేరుకోవడంలేదు. ప్రమాదం ఏదైనా.. తక్షణం ప్రథమ చికిత్స అందితేనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. క్షతగాత్రులకు, రోగులకు అత్యంత వేగంగా వైద్య సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 108 బైక్ సర్వీసును ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుత అంబులెన్సులు వెళ్లలేని కాలనీలకు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో వేగంగా ప్రమాదస్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించేందుకు ఈ బైక్‌లను అందుబాటులోకి తెస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు 108 బైక్‌లను 50 సిద్ధం చేశారు. ఈ వాహనాలను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నది. ప్రథమ చికిత్స, వైద్య నైపుణ్యాలు కలిగిన వ్యక్తిని ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్సు ఉద్యోగిగా నియమించి 108 సేవలకు వినియోగించనున్నారు. రూ.లక్ష ఖర్చుతో ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్సు వాహనం, మెడికల్ కిట్‌ను ఏర్పాటు చేశారు. రూ.50 లక్షలతో మొత్తం 50 వాహనాలను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నారు. ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్సు నిర్వహణకు ఒక్కో వాహనానికి నెలకు రూ.35 వేల వరకు ఖర్చు చేయనున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







