ముంబైలోని ప్రయాణికులకు రైల్వేశాఖ మంత్రి కొత్త సంవత్సర కానుక
- October 25, 2017
దేశ ఆర్థిక నగరమైన ముంబైలోని ప్రయాణికులకు కేంద్ర రైల్వేశాఖామంత్రి పీయూష్ గోయల్ 2018 జనవరి 1న కొత్త సంవత్సర కానుక ఇస్తామని ప్రకటించారు. పశ్చిమ రైల్వే పరిధిలోని ముంబై నగరంలో మొట్టమొదటిసారి ఫస్ట్ ఏసీ లోకల్ రైలు సర్వీసును వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రవేశపెట్టనున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫస్ట్ క్లాస్ టికెట్ కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా టికెట్ తో నడిచే ఈ లోకల్ ఏసీ రైళ్ల కోచ్ లను చెన్నై నగరంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. కేవలం 20 నుంచి 30 సెకన్ల పాటు స్టేషన్లలో ఆగే ఈ ఏసీ లోకల్ రైళ్లతో ముంబై ప్రయాణికులకు మెరుగైన సేవలందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు ముంబయి నగరంలో రైల్వే ప్రయాణికుల భద్రత కోసం 370 ఎస్కలేటర్లు, సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు పీయూష్ గోయల్ వివరించారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఏసీ లోకల్ రైళ్లను నడుపుతామని మంత్రి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







