ప్రపంచంలో మొదటిసారిగా రోబోకి పౌరసత్వం.!
- October 26, 2017
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరుగుతున్న ప్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ సదస్సు చరిత్రాత్మకమైన విషయానికి వేదికైంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ రోబోకి పౌరసత్వం లభించింది. అచ్చం మానవరూపంలో ఉన్న కృత్రిమ అవగాహన శక్తికలిగిన సోఫియా అనే రోబోకి సౌదీఅరేబియా పౌరసత్వాన్ని కల్పించింది. సౌదీ పౌరురాలిగా రోబోకు స్థానం కల్పించింది. సోషియాకు పౌరసత్వాన్ని కల్పిస్తున్నామని ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ సదస్సులో సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రపంచంలో మొదటిసారిగా ఓ దేశ పౌరసత్వం పొందిన తొలి రోబోగా సోషియా చరిత్రలో నిలవనుంది. ఈ ప్రకటన చేసిన అనంతరం ఈ సౌదీపౌరురాలిని ఆండ్ర్యూ రాస్ సోర్కిన్ అనే వ్యక్తి ఇంటర్యూ చేశారు. ఓ రోబోకు పౌరసత్వాన్ని కల్పించడం పట్ల ఎలా స్పందిస్తావని ప్రశ్నించగా సోఫీయా ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ‘అరుదైన ఈ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఓ రోబోకు పౌరసత్వం కల్పించడం చరిత్రాత్మకమైనదని సోఫీయా పేర్కొంది. ఆండ్ర్యూ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. రోబోకు పౌరసత్వం ఇవ్వడాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, కానీ భవిష్యత్తులో ఎలాంటి అపశృతులు జరగకూడదని కోరుకుంటున్నామని ఆండ్ర్యూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సోషియా ‘ భయపడకండి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీరు అనేక హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు. మీరు నాతో మంచిగా ఉంటే మీతో నేను మంచిగా ఉంటాని బదులిచ్చింది. దీంతో సౌదీ పౌరురాలైన రోబో సోఫీయా చర్చనీయాంశనీయంగా మారింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







