శంషాబాద్ లో ఆగివున్న విమానం నుంచి జారిపడ్డ ఎయిర్‌హొస్టెస్
- October 26, 2017
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(శంషాబాద్)లో ఆగి ఉన్న ఓ విమానం నుంచి ఎయిర్‌హోస్టెస్ జారి పడింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకొంది.
విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మస్కట్ నుంచి ఒమన్ ఎయిర్ లైన్స్ విమానం గురువారం మధ్యాహ్నం 1.40గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైంది. అనంతరం విమానం పార్కింగ్ స్థలానికి చేరుకుంది.
ప్రయాణికులు ఎక్కేందుకు విమానాన్ని సిద్ధం చేస్తుండగా అందులో ఉన్న ఓ ఎయిర్‌హొస్టెస్ ప్రమాదవశాత్తు విమానం ప్రవేశ ద్వారం వద్ద నుంచి జారి పడింది. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆమెను ఎయిర్‌పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







