రూటు మార్చిన బ్రహ్మానందం...
- April 29, 2015
తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ కమెడియన్ అనిపించుకున్న బ్రహ్మానందం బోర్డర్ దాటేస్తున్నాడు. బ్రహ్మానందం ఉంటే తమ సినిమాలకు అదనపు ఆకర్షణ అవుతాడని భావించిన తమిళ నిర్మాతలు ఆయన్ను తమ సినిమాల్లో నటించమని కోరుతున్నారు. సూర్య, సమంత కాంబినేషన్‌లో వచ్చిన 'అంజాన్'లో బ్రహ్మానందం నటించాడు. తెలుగులో విజయం సాధించకపోయినా, తమిళంలో హిట్ అయ్యింది ఆ సినిమా. అందులో బ్రహ్మానందం కామెడీకి మంచి పేరొచ్చింది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి విజయ్ నటించిన 'జిల్లా' సినిమాలో బ్రహ్మానందంను పెట్టారు. తమిళ ప్రేక్షకులు కూడా బ్రహ్మానందం కామెడీకి పడీ పడీ నవ్వుతున్నారు. పొట్ట చెక్కలయ్యేలా తమను నవ్విస్తున్న బ్రహ్మానందం పట్ల తమిళ ప్రేక్షకులు కూడా అభిమానం పెంచుకుంటున్నారు. కమెడియన్లు ఇతర భాషల్లో రాణించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఆ ఘనతను మన బ్రహ్మీ సొంతం చేసుకోవడం మనకు గర్వకారణమే కదా.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







