'దొంగాట' వాయిదా!

- April 29, 2015 , by Maagulf
'దొంగాట' వాయిదా!

మంచు లక్ష్మి-అడవి శేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'దొంగాట' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయి మే 1న విడుదల అంతా సిద్ధమైంది. అయితే తాజాగా ఈ చిత్రం విడుదల వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పలు పెద్ద సినిమాలు మే మొదటి వారంలో విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడు విడుదల చేస్తారనేది త్వరలో ప్రకటించనున్నారు. మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మంచు లక్ష్మి చిట్టి కూతురు విద్యా నిర్వాణ సమర్ఫణలో విడుదలవుతోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. కింగ్ నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. 'దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తోంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com