రామ్‌చరణ్ నటిస్తున్న 'రంగస్థలం 1985' సాంగ్ షూటింగ్
- October 26, 2017రామ్ చరణ్ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో కమర్షియల్ మూవీసే ఎక్కువ. ప్రయోగాలు చేసిన ఆరెంజ్, గోవిందుడు అందరివాడేలే నిరాశపరిచాయి. అయినా పట్టువదలకుండా ధృవ మూవీతో కాస్త వైవిధ్యం చూపించి సక్సెస్ అయ్యాడు. గతేడాది వచ్చిన ధృవ మంచి విజయాన్ని అందుకుంది.
ధృవ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం రంగస్థలం 1985. మైత్రీ మూవీస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీకి స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ డైరెక్టర్. సినిమా సినిమాకి వేరియేషన్ చూపించే సుకుమార్... రంగస్థలంతో ఈ సారి ముప్పై ఏళ్లు ఆడియన్స్ ని వెనక్కి తీసుకెళ్ళబోతున్నాడు. 1985 కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. అందుకే సినిమా కోసం మెగా అభిమానులతో పాటు అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
రంగస్థలం మూవీ 1985 కాలం నాటి కథ కాబట్టి, అప్పటిలానే సెట్స్ వేసి షూట్ చేస్తున్నారు. గోదావరి పరిసరాల్లోనూ గ్రామాల్లో ఎక్కువ బాగం షూట్ జరిగింది. అలాగే పాటల్లోనూ అప్పటి కాలం గుర్తొచ్చేలా సెట్స్ వేస్తున్నారు. రీసెంట్ గానే రామ్ చరణ్ ఆర్ట్ వర్క్ కి సంబంధించిన స్టిల్స్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం రంగస్థంలో సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది. ఆ స్టిల్ ని కూడా రిలీజ్ చేసింది టీమ్.
రంగస్థలం మూవీలో రామ్ చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి గడ్డం, లుంగీతో కనిపించబోతున్నాడు చరణ్. ఇక చెర్రీకి జోడీగా సమంత నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భారీ అంచనాలున్న రంగస్థలం 1985, వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం