తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు

- October 27, 2017 , by Maagulf
తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు

తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మేధ సర్వో డ్రైవ్స్‌ ప్రైవేటు కంపెనీతో చేసుకున్న ఈ ఒప్పంద ఎంవోయూపై ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌ సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. ప్రైవేటు రంగంలో రైల్వేకోచ్‌లను తయారు చేసే ఈ పరిశ్రమను రూ.800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయనున్నారు. ఐటీసీ గ్రాండ్‌ కాకతీయలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేధ సర్వో డ్రైవ్స్‌ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com