దుబాయ్‌లో ప్రవాస భారతీయుల ప్రధమ స్థానం
- October 27, 2017
దుబాయ్ : భారతీయ ప్రవాసీయులు ఆస్తుల కొనుగోళ్లలో మొదటి స్థానంలో ఉన్నట్లు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించిన గణాంకాలలో తేలింది. 2016 జనవరి నుంచి జూన్ 2017 వరకూ భారతీయులు దుబాయ్‌లో రూ. 42 వేల కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారు ఈ మొత్తం గత ఏడాది కంటే రూ. 12,000 కోట్లు అధికం. దుబాయ్‌లో భారతీయులు ఎక్కువగా అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తుండగా, మరికొందరు విల్లాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్‌పై భారతీయులకున్న ముద్ర ఏపాటిదో దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించిన గణాంకాలతో స్పష్టమవుతోంది. ముంబయి, పుణే, అహ్మదాబాద్‌కు చెందిన వారు ఎక్కువగా దుబాయ్ ఆస్తులపై ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో అత్యధికులు దుబాయ్‌లో అపార్ట్మెంట్, విల్లా కొనుగోలుకు రూ. 6.5 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఎనిమిది శాతం మంది రూ. 65 లక్షల నుంచి రూ. 3.24 కోట్లలో ఆస్తి కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని దుబాయ్ ప్రాపర్టీ షో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఇక 9 శాతం మంది భారతీయులు దుబాయ్‌లో కమర్షియల్ ప్రాపర్టీని, 6శాతం మంది స్థలాలను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దుబాయ్ ఇన్వెస్టర్లకు అందుబాటు ధరల్లో ప్రాపర్టీలను అందిస్తోందని, రూపాయి బలోపేతమవడం కూడా ప్రాపర్టీ మార్కెట్‌కు ఊతం ఇస్తోందని అధ్యయనం తేల్చింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







