ఇక పై విమాన ప్రయాణం చేయాలంటే ఐడీ కార్డు తప్పనిసరి
- October 27, 2017విమానంలో ప్రయాణించేందుకు విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు తనిఖీ అధికారులకు పది రకాల ఐడెంటిటీ కార్డులను చూపించవచ్చని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లోకి ప్రవేశించాలంటే ప్రయాణికులు పాస్పోర్టు, ఓటరు ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, సర్వీస్ ఐడీ, స్టూడెంట్ ఐడీ కార్డు, ఫోటోతో ఉన్న జాతీయ బ్యాంకు ఖాతా పాస్ బుక్, పెన్షన్ కార్డు, లేదా ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్లు, వికలాంగుల మెడికల్ సర్టిఫికెట్లలో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా తీసుకురావాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు కోరారు. ఈ పది రకాల ఐడీ కార్డులు లేకుంటే ఎవరైనా కేంద్ర, రాష్ట్రప్రభుత్వ గజిటెడ్ ఆఫీసరు తన లెటరు ప్యాడ్ పై ఫోటో అటెస్టేషన్ తో పాటు ఇచ్చే లేఖ అయినా విమానాశ్రయాల్లో ప్రవేశం కోసం చూపించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సూచించింది. శిశువులకు మాత్రం ఈ గుర్తింపు కార్డు లేకున్నా విమానాశ్రయాల్లోకి అనుమతిస్తామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు