ఎయిర్‌పోర్టుల్లో ఇకపై మొబైల్ ఆధార్
- October 28, 2017
విమానాశ్రయంలో ప్రవేశానికి ఇకపై గుర్తింపు కార్డుగా మొబైల్ ఆధార్ (ఆధార్ యాప్)ను ఇకపై వినియోగించుకోవచ్చు. ఈ మేరకు విమానయాన భద్రతా విభాగం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పాటు తల్లిదండ్రులతో పాటు వెళ్లే మైనర్లకు గుర్తింపు కార్డు చూపడం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఎయిర్‌పోర్టులో ప్రవేశానికి బీసీఏఎస్ ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ, ఆధార్ లేదా ఎం-ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపడం ద్వారా విమానాశ్రయంలో ప్రవేశం పొందొచ్చని పేర్కొంది. వీటితో పాటు ఏదైనా జాతీయ బ్యాంక్ జారీ చేసిన పాస్‌బుక్, పెన్షన్ కార్డు, దివ్యాంగ గుర్తింపు కార్డుతో పాటు, సర్వీస్ ఐడీని కూడా గుర్తింపుగా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎవరైనా ప్రయాణికులు పై గుర్తింపు కార్డుల్లో ఏదైనా సమర్పించలేనప్పుడు గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రాన్ని చూపించినా సరిపోతుందని తాజా మార్గదర్శకాల్లో బీసీఏఎస్ పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రం తమ పాస్‌పోర్టుతో పాటు, విమాన టికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







