భిన్నత్వంలో ఏకత్వం సాక్షీకరించిన దీపావళి వేడుక కార్యక్రమం

- October 28, 2017 , by Maagulf
భిన్నత్వంలో ఏకత్వం సాక్షీకరించిన  దీపావళి వేడుక కార్యక్రమం

దుబాయ్: చెడుపై మంచి గెలుపుని జ్ఞాపకం చేసుకొంటూ...వెలుగు దివ్వెల కాంతులతో చీకటిని పారదోలే అతి పెద్ద భారతీయ ఉత్సవం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి దీపావళి పండుగ ఒక పెద్ద వేడుకగా ఆచరిస్తారు.  దీంతో మరలా 8,000 మందికి పైగా యుఎఇ నివాసితులు దీపావళి ఉత్సవ్ 2017 ను ఉత్సాహంతో ఆచరించారు. దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమం పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం అకాడెమిక్ సిటీలో అమిటీ యూనివర్సిటీ మైదానంలో ఈ కార్యక్రమం అత్యంత ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడింది. పలు కార్యక్రమాలను  ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ ఓ ఐ) ఆధ్వర్యంలో కొనసాగేయి. ముఖ్యంగా దీపావళి  వేడుకలు భిన్నత్వంలో ఏకత్వం (యూనిటీ ఇన్ డైవర్సిటీ) అంశంపై  ఆధారపడినవి.  హాజరైన వారు సాంప్రదాయ భారతీయ వస్త్రధారణతో సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ వేదికపైకి రావడం గమనార్హం. ఈ ఉత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇండియా కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా విపుల్ మాట్లాడుతూ, భారత్ నిర్మాణంలోనే  భిన్నత్వంలో ఏకత్వం అనే విధానం ప్రాధమిక పునాది ఉందని  అభిప్రాయపడ్డారు. విభిన్న భాషల్లో మాట్లాడుతున్న ప్రజలు అందరు సామరస్యంగా ఐక్యంగా జీవిస్తున్న విధానం భారతదేశంకు మాత్రమే ప్రత్యేకమని విపుల్ అన్నారు. సాయంత్రం రంగురంగుల రంగోలి పోటీతో దీపావళి వేడుక ప్రారంభమైంది, ఆ తర్వాత సాంప్రదాయ భారతీయ క్రీడా పోటీలు ఆటే పాటియ, ఖో ఖో, మరియు లాఘోరి  వంటి ఆటలు పలువురు వీక్షకులకు సంతోషాన్ని కల్గించాయి. ఈ కార్యక్రమంలో బెలూన్ షూటింగ్, బాల్ అండ్  బకెట్, సిక్స్త్ సెన్స్, మరియు ఒక భారతీయ చరిత్ర అవలోకనం వంటి ఆటలతో ఒక వినోద సరసమైన విభాగం ఆహుతులను ఆకట్టుకొన్నాయి. ఈ ఉత్సవంలో ఆహార విభాగం వద్ద సాధారణ మరియు దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధ భారతీయ వంటకాలు వడ్డించబడ్డాయి. జానపద నృత్య పోటీలో 14 జట్లు ఉత్సాహంగా పాలుపంచుకొన్నాయి. అందులో 10 ప్రాంతాల వారు  "భరత్ కా సితారే " బహుమతి కొరకు పోటా పోటీగా నృత్యాలను ప్రదర్శించారు. కర్నాటక రాష్ట్రం నుండి నృత్యకారులు విజేతలుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నృత్యకారులు రెండవ స్థానం దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సతతహరిత ప్రదర్శనకారులు, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ పాప్ గాయనీ  ఉషా ఉతుప్. వేర్వేరు భారతీయ భాషలలో పాటలు పాడి  కారక్రమానికి హాజరైన వేలాదిమంది యుఎఇ నివాసితులలో వినోదాన్ని సంతోషాన్ని ఆమె కల్గించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com