రికార్డు సృష్టించిన 'విలన్' సినిమా
- October 29, 2017
మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'విలన్'. విశాల్, రాశీఖన్నా, హన్సికలు ముగ్గురు ఈ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. బి. ఉన్ని కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లతో రికార్డు సృష్టించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఓపెనింగ్ రోజున రూ.4.91 కోట్లు సాధించిన తొలి చిత్రం ఇదేనని పేర్కొన్నారు.
కేరళలో 253 స్క్రీన్లపై 'విలన్' చిత్రం విడుదలైంది. ఇన్ని స్క్రీన్లపై విడుదలైన తొలి మలయాళ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. క్రైం థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై రాక్‌లైన్ వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశిన్ శ్యాం స్వరాలు అందించారు. మంజూ వారియర్, శ్రీకాంత్, సిద్ధిఖీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
మోహన్‌లాల్ నటించిన చిత్రం 'పులిమురుగన్' కూడా గతంలో మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డు సృష్టించింది. ఇది మొత్తం రూ.130 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. బాక్సాఫీసు వద్ద ఈ స్థాయిలో వసూలు చేసిన తొలి మలయాళ చిత్రమిదేనని విశ్లేషకులు పేర్కొన్నారు. మోహన్‌లాల్ 'జనతాగ్యారేజ్', 'మన్యంపులి' ('పులిమురుగన్' డబ్బింగ్ వెర్షన్) తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్