భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతాం-గూగుల్‌ సంస్థ

- October 29, 2017 , by Maagulf
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతాం-గూగుల్‌ సంస్థ

గూగుల్‌ సంస్థ ఆశయాలు మరిన్ని ప్రాంతీయ ప్రాడక్టులను ప్రారంభిస్తుందని, ఈ ప్రాంతంలో భారీ పెటుబడు లు పెట్టడానికి కట్టుబడి ఉందని గూగుల్‌ సంస్థ సిఇఒ సుందర్‌ పిచా§్‌ు చెప్పారు. భారత్‌లో ఇటీవల గూగుల్‌ ఆవిష్కరించిన మొబైల్‌ వ్యాలెట్‌ తేజ్‌ విజయవంతం కావడాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. త్రైమాసిక ఫలితాలు వెల్లడించడం కోసం ఏర్పాటుచేసిన ఇన్వెస్టర్లు, విశ్లేష కుల సమావేశంలో పిచా§్‌ు మాట్లాడారు. ఇలాంటి సమావేశాల్లో భారత్‌ పెద్దఎత్తున ప్రస్తావనకు రావడం ఇదే మొదటిసారి. లక్షలాది మంది ప్రజల కు తోడ్పడడంకోసం ఆసియాలో స్థానిక మార్కెట్ల అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక ప్రాడక్టులను తాము రూపొందిస్తున్నామని, భారత్‌లో గత నెల తాము తేజ్‌ పేరుతో ఒక మొబైల్‌ పేమెంట్లు, వాణి జ్య యాప్‌ను ప్రవేశపెట్టామని, దానికి ఇప్పటికే 75లక్షలకన్నా పైబడిన వినియోగదారులు ఉన్నారని సుందర్‌ పిచా§్‌ు తెలిపారు.
వారంతా మూడు కోట్లకు పైగా లావాదేవీలు కూడా జరిపారని ఆయన చెప్పారు. భారత్‌ చాలావరకు నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని అలాంటి చోట ఇది అంతగా విజయ వంతం కావడం నిజంగా తనకు ఎంతో సంతోషం గా ఉందని, భారత్‌లో పుట్టి, విద్యాభ్యాసం చేసిన సుందర్‌ పిచా§్‌ు అన్నారు. ఆసియాలో తాము ఇప్పుడున్న బృందాలకు తోడు అదనంగా మరిన్ని పెట్టుబడులు పెడుతున్నామని ఆయన చెప్పారు. అంతేకాకుండా గొప్ప ప్రాడక్టు, ఇంజినీరింగ్‌ బృం దాలను తయారు చేస్తున్నామని, సెర్చ్‌, మ్యాపులు, యూట్యూబ్‌ లాంటి కీలకప్రాడక్టులను మెరుగుపరచ డానికి ఇది తమకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు.
మొత్తం మీద ఇవన్నీ కూడా ఒక మంచి వర్య్చూవస్‌ సైకిల్‌ను రూపొంది స్తుందని, ఈ అవకాశం కోసమే తాము ఎదురు చూస్తున్నామని పిచా§్‌ు అన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భిన్నమైన అవకాశాలు ఉంటాయని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మొబైల్స్‌ను మొదటగా ఉపయోగించే మార్కె ట్లు అయినందున ఇవన్నీ భిన్నమైనవి ఆయన చెప్పారు. తమ ప్రాడక్టులు ఉపయోగించడంలో రకరకాల మార్గాలు ఉపయోగించే వ్యక్తులు తమకు లభిస్తారని, అందువల్ల వీరికోసం భిన్నమైన ఆలోచనలతో ముందుకుపోయి అక్కడ ఉన్న అవకాశాలతోనే వాటిని ఎదుర్కొవలసి ఉంటుందని కూడా ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com