లైవ్ ఫీచర్ తో ఇన్‌స్టాగ్రామ్‌

- October 29, 2017 , by Maagulf
లైవ్ ఫీచర్ తో ఇన్‌స్టాగ్రామ్‌

ఇన్‌స్టాగ్రామ్....మోస్ట్ పాపులర్ యాప్స్ లో ఇది ఒకటి. మూవీకి వెళ్లినా....షాపింగ్ చేస్తున్నా...ఓ సెల్ఫీ లేదా వీడియో క్లిక్‌మనిపించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ఈ రోజుల్లో కామన్ అయ్యింది. లైకులు, ఫాలోవర్ల ఆధారంగానే ఎవరికి ఎంత పాపులారిటీ ఉందో ఈజీగా చెప్పొచ్చు.
అత్యంత పాపులారీటిని సంపాదించుకున్న ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు మరోకొత్త ఫీచర్ను యాడ్ చేసింది. ఈ ఫీచర్ తో ఫ్రెండ్స్ తో లైవ్లో మాట్లాడుకునే వీలుంటుంది. ఈ అప్ డేట్ ఫీచర్ను ఇన్‌స్టాగ్రామ్‌ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాం కోసం వెర్షన్ 20 ద్వారా అందుబాటులో ఉన్నాయి.
ఈ అప్ డేట్ ఫీచర్ ద్వారా మీ స్నేహితులతో లైవ్ వీడియోలో ముచ్చటించవచ్చు. అయితే ఇది ఎలా పనిచేస్తుంది? మీరు లైవ్ లో ఉన్నప్పుడు, ఇతరులను ఆహ్వానించాలనుకుంటే...కుడివైపున్న న్యూ ఐకాన్ గుర్తును ప్రెస్ చేయండి.
ఇలా ప్రెస్ చేయడంతో మీరు వారిని యాడ్ చేసే చేయవచ్చు. ఒకసారి మీ ఫ్రెండ్ జాయిన్ అయినట్లయితే... మీరు స్క్రీన్ స్ప్లిట్ పై మీ స్పేహితుడిని చూడటానికి మళ్లీ ప్రెస్ చేయండి. దీంతో మీ ఫ్రెండ్ పాపప్ కింద కనిపిస్తారు.
అంతేకాదు మీరు గెస్ట్ ను రిమూవ్ చేసి...వేరొకరిని యాడ్ చేయడానికి మీకు ఫుల్ ఫ్రీడం ఉంటుంది. జస్ట్ ఫేయిర్ ఉంచడానికి కూడా మీ ఫ్రెండ్ ఎప్పుడైనా వీడియో నుంచి ఎగ్జిట్ అవడానికి సెలక్ట్ చేసుకోవచ్చు.
లైవ్ వీడియో ఎండ్ అయిన తర్వాత...వీడియోను షేర్ చేయవచ్చు. అదేవిధంగా మీరు అనుకున్నట్లుగా వీడియో లేనట్లయితే దానిని రిమూవ్ చేసే అప్షన్ కూడా ఉంటుంది.
మీరు ఫాలో అయ్యే వ్యక్తి మీతో వీడియోలో క్లోజ్ గా మూవ్ అవుతున్నప్పుడు...మీ స్టోరిస్ బార్లో కలిసి రెండు సర్కిల్లు ఉంటాయి. వాటిని చూడటానికి దానిపై ట్యాప్ చేయవచ్చు. మీకు నచ్చినట్లుగా కామెంట్స్ కూడా చేసుకోవచ్చు.
లైవ్ వీడియోను నవంబర్ 2016లో ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ చేర్చారు. ఈ ఫీచర్ అత్యంత పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాదు ఈ యాప్ మరింత ఫన్నీగా ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది. కొత్త ఫీచర్ ద్వారా హైలైట్ చేసిన ఒక వీడియోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ లో చేర్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com