"తీరని కోరిక ఒకటి ఉంది" అంటూ సస్పెన్స్ లో పడేసిన రజిని
- October 29, 2017
దుబాయ్: దుబాయ్‌లో '2.ఓ' చిత్ర ఆడియో వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో రజనీకాంత్ మాట్లాడిన తీరుపై హాల్ చప్పట్లతో మారుమోగిపోయింది. అయితే రజనీ ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. 'తీరని కోరిక ఒకటి ఉంది. ఏం జరుగుతుందోచూడాలి.' అని వ్యాఖ్యానించినట్లు చిత్రవర్గాల సమాచారం.
అయితే ఏ అంశం గురించి ఆయన ఈ మాట అన్నారో తెలీడంలేదు. బహుశా రాజకీయ ప్రవేశం గురించి ఆయన ఈ విధంగా వ్యాఖ్యనించినట్లు చిత్రవర్గాలు భావిస్తున్నాయి. కమల్ హాసన్ పార్టీ పెడుతున్న నేపథ్యంలోనూ రజనీ స్పందించారు. రాజకీయాల్లోకి రావాలంటే పేరు, హోదా ఉంటే చాలదని అంతకంటే ఎక్కువే అర్హతలు ఉండాలని అన్నారు.
'2.ఓ' చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్ నటించింది. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. నవంబర్‌లో హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. 2018 జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







