పొట్లకాయ రసాన్ని తలకు పట్టిస్తే.. లాభమేంటి?
- October 29, 2017
పొట్లకాయ ఆరోగ్యానికే కాదు శిరోజాల పోషణకు కూడా మెరుగ్గా పనిచేస్తుంది. విటమిన్-ఎ, బి, సిలతోబాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ కలిగివుండే పొట్లకాయ రసాన్ని తలకి పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు తగ్గుతుంది. పొట్లకాయ శరీరంలోని టాక్సిన్లను సమర్థంగా తొలగిస్తుంది. మూత్రపిండాలూ, మూత్రాశయం పనితీరునీ మెరుగుపరుస్తుంది.
గొంతులోని కఫాన్ని తగ్గించడంతో పాటు శ్వాసవ్యవస్థ పనితీరుకీ పొట్లకాయ దోహదపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి కూడా పొట్లకాయ తోడ్పడుతుంది. అందుకే దీన్నుంచి తీసిన రసం రోజూ రెండు కప్పులు తాగితే హృద్రోగ సమస్యలు తగ్గుతాయట. బీపీనీ తగ్గిస్తుంది. మలేరియా జ్వర బాధితులకి పొట్లకాయ రసం మేలు చేస్తుంది. ఇది యాంటీబయోటిక్గానూ పనిచేస్తుంది.
పొట్లకాయలో కేలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి. పీచు పదార్థం పొట్లకాయలో అధికంగా ఉంటుంది. రెగ్యులర్గా పొట్లకాయ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..