గల్ఫ్ వివాదంలో 'సైనిక జోక్యం' వద్దు అని ఖతార్‌ అమీర్‌ షేక్‌ అమీమ్‌ స్పష్టం

- October 29, 2017 , by Maagulf
గల్ఫ్ వివాదంలో 'సైనిక జోక్యం' వద్దు అని ఖతార్‌ అమీర్‌ షేక్‌ అమీమ్‌ స్పష్టం

- ట్రంప్‌నకు ఖతార్‌ అమీర్‌ సూచన 
నాలుగు అరబ్‌ దేశాలకు, తమకు మధ్య ఏర్పడిన వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం కావల్సిందే తప్ప సైనిక జోక్యంతో కాదని ఖతార్‌ అమీర్‌ షేక్‌ అమీమ్‌ స్పష్టం చేశారు. అమెరి కాకు చెందిన ఒకటీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లా డుతూ ఇరువర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తానని ట్రంప్‌ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత వివాదానికి చర్చల ద్వారానే తప్ప సైనిక జోక్యంతో పరిష్కారం లభించబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంలో సైనిక జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం అంతా తీవ్ర గందరగోళానికి గురవుతుందన్నారు. ట్రంప్‌ హామీ ఇచ్చిన దౌత్యపరమైన సాయం త్వరలోనే అందుతుందని తాను భావిస్తున్నానని, అయితే ఇప్పటి వరకూ తనకు ఎటువంటి స్పందనా లభించలేదని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com