ఘనంగా విక్రమ్ కుమార్తె వివాహం
- October 30, 2017
స్టార్ హీరో విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ముని మనవడు మను రంజిత్‌తో ఇవాళ ఉదయం వైభవంగా జరిగింది. రంజిత్, అక్షిత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరువురి పెద్దలు అంగీకారం తెలపడంతో వీరి ప్రేమకు పెళ్లికార్డు రెడీ అయింది. 2016 జూలైలో నిశ్చితార్థం జరిగింది. ఇవాళ ఉదయం వేదమంత్రాల సాక్షిగా ఈ జంట ఒక్కటైంది. ప్రస్తుతం విక్రమ్ సామి స్క్వేర్ సినిమాలో నటిస్తున్నారు. కూతురి వివాహ నిమిత్తం కొద్ది రోజులపాటు షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ మూవీలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం