సౌదీ ప్రభుత్వం అక్కడి మహిళలకు మరో గుడ్‌న్యూస్
- October 30, 2017
సౌదీ మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఇటీవలే సౌదీ మహిళలు డ్రైవింగ్ చేయొచ్చని పేర్కొన్న ప్రభుత్వం, తాజాగా మహిళలను స్పోర్ట్స్ స్టేడియాల్లోకి అనుమతించనున్నట్టు కీలక నిర్ణయం ప్రకటించింది. మూడు ప్రధాన స్టేడియాల్లోకి వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మహిళలను అనుమతించనున్నట్టు ఆ దేశ స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ జనరల్ స్పోర్ట్ అథారిటీ తెలిపింది. రియాద్, జెద్దా, దమన్ స్టేడియాల్లోకి మహిళలు కూడా వచ్చి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని, దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంది. అయితే వీరు కూర్చునేందుకు సీటింగ్ సౌకర్యం ఎలా ఉండబోతుందో ఇంకా తెలుపలేదు.
మహిళలను, పురుషులను అనుమతించే ప్రాంతాల్లో సౌదీలో ఇరువురిని వేరువేరుగా కూర్చోబెడతారు. సౌదీలో మహిళలకు ఎన్నో కఠినమైన ఆంక్షలు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ దేశంలో మహిళలకు నిబంధనలు ఉంటాయి. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మహిళలపై ఎప్పటి నుంచో కొనసాగుతున్న వివక్షను ఇటీవల కాలంలో తగ్గిస్తు వెళ్తున్నారు. మహిళలకు, పురుషులకు సమాన హక్కులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇకపై మహిళలు స్టేడియంలోకి వచ్చి మ్యాచ్‌లు వీక్షించొచ్చని ప్రకటించారు. వర్క్‌ఫోర్స్‌లో కూడా మహిళల చేయూతను 22 శాతం నుంచి 30 శాతానికి పెంచాలనుకుంటున్నట్టు కూడా అక్కడి ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం