ఒమాన్లొ త్వరలో రద్దు కానున్న స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు యొక్క అన్ని క్రెడిట్ కార్డులు

- November 07, 2015 , by Maagulf
ఒమాన్లొ త్వరలో రద్దు కానున్న  స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు యొక్క అన్ని క్రెడిట్ కార్డులు

ఒమాన్లొ తమ క్రెడిట్ కార్డుల విభాగ కార్య కలాపాలను నిలిపివేస్తున్నందున, అన్ని క్రెడిట్ కార్డులు రద్దు చేస్తున్నట్టు, ఈ మేరకు సమాచారాన్ని ఇ- మెఇల్స్, ఎస్. ఎం. ఎస్. లు, ఉత్తరాలు మొదలైన పద్ధతుల ద్వారా ఒమనీయులకు మరియు ప్రవాసీయులైన తమ ఖాతాదారులందరికీ కూడా అందిస్తున్నామని బ్యాంకు వారు తెలిపారు. ఈ సమాచారాన్ని ఖాతాదారు అందుకున్న రోజు నుండి 150 రోజుల లోగా తన లావాదేవి లను పూర్తీ చేసుకోవాలని వారు స్పష్టం చేసారు. ఒకవేళ ఏ ఖాతాదారు అయినా సమాచారాన్నందుకోనట్లయితే, తమ 24 గంటల ఫోన్ బ్యాంకింగ్ సర్వీసు నెంబరు +968 24773535  లేదా దగ్గర లోని బ్యాంకు కార్యాలయాన్ని సందర్శించాలని వారు విజ్ఞప్తి చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com