మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు
- November 07, 2015
మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. తెలుగు, తమిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. బంధాలు..అనుబంధాలు నేపథ్యంతో విజయవాడ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ బ్రహ్మోత్సవం సినిమా తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవం సన్నివేశంతో శుభం కార్డ్ పడుతుందని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. సమ్మర్ సీజన్లో మహేష్ బాబు సినిమా వచ్చి దాదాపు పదేళ్లయింది. 2006లో ఆయన నటించిన 'పోకిరి' సినిమా విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత మళ్లీ వేసవి సీజన్‌లో మహేష్ సినిమాలేవీ విడుదల కాలేదు. దశాబ్దం గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' 'పోకిరి' రిలీజైన ఏప్రిల్ నెలలోనే తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలందిస్తున్నారు. గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు. బ్రహ్మోత్సవం చిత్రాన్ని పి.వి.పి సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. సత్యరాజ్, జయసుధ, రావు రమేష్, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్, కూర్పు: శ్రీకర ప్రసాద్, కళ: తోట తరణి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







