బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
- October 30, 2017
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. శ్రీలంక తీరానికి నైరుతి దిశగా మయన్మార్ సమీపంలో రేపటి వరకు ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు దీని దశను చెప్పలేమన్నారు వాతావరణ అధికారులు. రెండు, మూడు రోజుల్లో అల్పపీడన పయనంపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు తెలంగాణలో పగలు పొడి వాతావరణం ఏర్పడుతోంది. గాలిలో తేమ శాతం తగ్గడమే దీనికి కారణం. ఇక పగటి పూట మేఘాలు లేకపోవడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి త్వరగా వేడెక్కుతోందని అధికారులు చెప్పారు.
మరోవైపు ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి చెన్నైతో సహా పలు కోస్తా జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదలడంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాతావరణం అనుకరించకపోవడంతో సుమారు 25 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ఇవాళ కూడా చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. మరో ఐదు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ఇవాళ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …