కువైట్ క్యాబినెట్ రాజీనామా
- October 31, 2017
దుబాయ్: కువైట్ ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా, తమ ప్రభుత్వ రాజీనామాని ఆమోదించారు. ఆయిల్ రిచ్ గల్ఫ్ స్టేట్ పార్లమెంట్లో తలెత్తిన తాజా వివాదమే ఈ రాజీనామాకి కారణం. షేక్ జబెర్ ముబారక్ అల్ సబా, కొత్త క్యాబినెట్ ఏర్పాటయ్యేవరకు కేర్ టేకర్‌గా వ్యవహరిస్తారు. గత వారం 10 మంది అపోజిషన్ లా మేకర్స్, షేక్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సబాకి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టారు. ఫైనాన్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించి ఆరోపణలు వచ్చాయి. అయితే క్యాబినెట్ ఎఫైర్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ షేక్ మొహమ్మద్ ఈ ఆరోపణల్ని ఖండించారు. ఏడాది క్రితమే కువైట్ క్యాబినెట్ ఏర్పాటయ్యింది. కువైట్ గత కొంతకాలంగా రాజకీయ అస్థిరత్వాన్ని ఎదుర్కొంటోంది. పార్లమెంటు పలుమార్లు రద్దయ్యింది కూడా.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..