5,911 నమోదైన 843 కంపెనీల లైసెన్స్ సస్పెండ్ చేసింది
- October 31, 2017
కువైట్: హవాలీ మరియు ఫర్వానియా గవర్నరేట్ల పరిధిలో ఆదివారం సాయంత్రం రాజధాని లో 843 నకిలీ కంపెనీల వ్యాపార లైసెన్సులను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పామ్) రద్దు చేసింది. ఈ కంపెనీలతో రిజిస్టర్ కాబడిన 5,911 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. అధికారిక సమాచారం ప్రకారం రాజధాని గవర్నరేట పరిధిలో 181 కంపెనీలలో 1,181 మంది ఉద్యోగులు హవాలీలో 314 కంపెనీలలో 2,144 మంది ఉద్యోగులతో మరియు ఫర్వాణీయలో 348 కంపెనీలతో 2,686 మంది ఉద్యోగులను రద్దు చేశారు. అధికారులు జరిపిన ఈ దాడులలో ప్రధానంగా ఇతర ఉల్లంఘనలతో పాటుగా నకిలీ కంపెనీల ఖాళీ కార్యాలయాలు దర్శనమిచ్చాయి.. ఈ నకిలీ కంపెనీలతో నమోదు చేసుకున్న ఉద్యోగులు ఎక్కడైనా పని చేయడమో లేదా నిరుద్యోగులుగా ఉన్నారు (ఉపాంత కార్మికులు). ఈ కంపెనీల యజమానులు మానవరవాణాకు పాల్పడుతున్నారు, ఎందుకంటే ఒక వాణిజ్య కార్యకలాపాన్ని సాధించకుండానే వారు వీసాలను గుత్తగా విక్రయించడానికి పై తరహా సంస్థలను స్థాపించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..