చైనాలోజాతీయగీతాన్ని అవమానిస్తే మూడేళ్లు జైలుకే
- October 31, 2017
ఓ పక్క భారతదేశంలో జాతీయ గీతం ప్రసారమవుతున్నప్పుడు నిలబడాలా వద్దా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశమైన చైనా తమ జాతీయజెండాకు సంబంధించి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. బహిరంగ ప్రదేశాల్లో తమ జాతీయ జెండాను అవమానించినా, జాతీయ గీతాన్ని గౌరవించకపోయినా మూడేళ్లు జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం త్వరలో చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. జాతీయ గీతం ప్రసారం అవుతున్నప్పుడు ఎవరన్నా అవమానకరంగా ప్రవర్తిస్తే వారిని 15 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉంచాల్సిందిగా సెప్టెంబర్‌లో చైనా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు కొత్తగా జాతీయ గీతంలోని అక్షరాలు కావాలని తప్పుగా పాడినా, అవమానించినా మూడేళ్లు కారాగార శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దీనిపై ఈ వారంలోనే పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 2015లో హాంకాంగ్‌లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో జాతీయ గీతం ప్రసారమవుతున్నప్పుడు పలువురు వ్యక్తులు అవమానకరంగా ప్రవర్తించారని వారికి ఫుట్‌బాల్ అసోసియేషన్ యాజమ్యాం జరిమానా విధించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో చైనాలోని ఓ స్మారకస్థూపం వద్ద ముగ్గురు వ్యక్తులు సైనికుల దుస్తులు వేసుకుని సెల్ఫీలు దిగుతుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం