శ్మశానాల్లో నిజంగానే ఆత్మలు, భూతాలు ఉంటాయా?
- October 31, 2017
అవి పురాతన శ్మశానాలు. వాటి అందం అట్రాక్ట్ చేస్తుంది. చూడాలనేలా చేస్తాయి. వాటి దగ్గరికి వెళ్తే అదో రకమైన ఫీలింగ్. ఎవరో పిలిచినట్లు అనిపిస్తుంది. వెనక్కు తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. ఉన్నట్టుండి ఎవరో గొంతు నులిమినట్లు అనిపిస్తుంది. కానీ ఎవరూ కనిపించరు.
మరి ఇదంతా ఎవరి పని? కంటికి కనిపించని ఆత్మలపనేనా? ఇంతకీ శ్మశానాల వద్దకు వెళ్తే ఎందుకలా జరుగుతుంది?
సవన్నాలోని శ్మశానంలో రికార్డయిన ఓ దృశ్యం...స్థానికులను భయపెట్టింది. అక్కడ జనం తిరుగుతున్నారు. సమాధిలోంచి లేచిన ఓ తెల్లని ఆకారం బాలుడి రూపంలో ముందుకు వెళ్లింది. కొంత దూరం వెళ్లగానే అది అదృశ్యమైంది.
కొలంబియాలోని శ్మశానం నుంచి కూడా ఓ నల్లని ఆకారం బయటకు వచ్చింది. బాలిక రూపంలో ఉన్న ఆ ఆకారం చెట్టు చాటు నుంచి వెళ్లిపోయింది. ఇది కూడా ఆత్మే అని భావిస్తున్నారు.
శ్మశానాల్లో నిజంగానే ఆత్మలు, భూతాలు ఉంటాయా?
ఇది తెలుసుకోడానికి అమెరికాలోని పారానార్మల్ యాక్టివిస్టులు అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్లారు. అత్యాధునిక పరికరాల సాయంతో వాటి ఉనికిని గుర్తించేపనిలో పడ్డారు. కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానంగా వారు ఉపయోగించిన యంత్రాల్లో లైట్లు వెలిగాయి. ఇవన్నీ ఆత్మల ఉనికికి సంకేతంగా భావిస్తోంది పారానార్మల్ యాక్టివిస్టుల టీం.
ఇక ఇలాంటి ప్రయత్నమే చేసింది మరో టీం. ఈ టీం సభ్యులు పెట్ యానిమల్స్ సిమెటరీని ఎంచుకున్నారు. అక్కడ అర్ధరాత్రి అత్యాధునిక పరికరాలతో వాలిపోయారు. అక్కడ కొన్ని వింత శబ్దాలు వినిపించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఆత్మల ఉనికిని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఆత్మలు, ప్రేతాత్మలు, దెయ్యాలు, భూతాలు ఉన్నాయా లేవా అనేది వందల ఏళ్ల నుంచి మనిషిని వేధిస్తున్న ప్రశ్న. నమ్మకం, మూఢనమ్మకాలను పక్కనపెట్టి వాటి ఉనికిని శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నిరంతర ప్రక్రియ. వాటి ఉనికిని కనుక్కోడానికి అవసరమైన యంత్రాలను తయారు చేశారు. అయినాసరే జనం వీటిని కూడా పూర్తిగా నమ్మలేకపోతున్నారు. దుష్టశక్తులు ఉన్నాయా, లేవా అనే సందేహం మళ్లీ మొదటికొస్తోంది. మరి భవిష్యత్తులోనైనా ఈ పరిశోధనలు ఫలిస్తాయో లేదో చూడాలి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం