భారతీయ అమెరికన్ దాతృత్వం..రూ.1300 కోట్ల విరాళం
- October 31, 2017
కోట్లకు పడగలెత్తి అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులు దాతృత్వంలోనూ ముందుంటున్నారు. గుజరాత్‌కు చెందిన డాక్టర్ కిరణ్ పటేల్ భారత్‌లో వైద్య విద్యను అభ్యసించి 1976లో అమెరికా చేరుకున్నారు. కార్డియాలజిస్ట్ అయిన పటేల్ కొంత కాలానికి, కొంత మంది ఫిజీషియన్లతో కలిసి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేశారు.
1992లో దివాలా తీసే పరిస్థితిలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీనీ కొనుగోలు చేశారు. ఇది ఆయన దశను మార్చింది. తిరిగి పదేళ్ల తరువాత పటేల్ ఆ కంపెనీని విక్రయించినప్పుడు దానిలో 4 లక్షల మంది సభ్యులున్నారు. దాని వల్ల ఆయనకు రూ.65 వేల కోట్ల లాభం వచ్చింది. ఇలా అంచెలంచెలుగా ఎదగనారంభించారు. అమెరికాలో కోట్లకు పడగలెత్తారు. గత ఐదేళ్లలో ఆయన నాలుగు ప్రైవేట్ జెట్ విమానాలను కొనుగోలు చేశారు. గుజరాత్‌లోని ఓ గ్రామంలో ఆయన 50 పడకల ఆసుపత్రి కట్టించారు.
ఆ క్రమంలోనే డాక్టర్ కిరణ్ పటేల్ రూ.1300 కోట్లు ప్లోరిడా యూనివర్శిటీకి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకోవడం సంచలనం సృష్టించింది. తాను ప్లోరిడా యూనివర్శిటీకి ఇచ్చిన ఆర్థిక సాయంతో భారత వైద్య విద్యార్థులు లాభం పొందుతారని పటేల్ అభిప్రాయపడుతున్నారు. ప్లోరిడాలోని తంపా పట్టణంలో కిరణ్ 40 బెడ్రూమ్ల బంగ్లాని నిర్మించుకున్నారు. ఈ బంగ్లాకు అవసరమైన రాళ్లను మొత్తం భారత్ నుంచి దిగుమతి చేసుకున్నారు. సంపద ఉన్నప్పుడు ఖర్చు చేయడంలో తప్పు లేదన్నది కిరణ్ వ్యక్తిగత అభిప్రాయంగా చెబుతారు.
తాజా వార్తలు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!