గ్లోబల్ విలేజ్‌లో నవంబర్ 1న ప్రత్యేక కార్యక్రమాలివే
- October 31, 2017నవంబర్ 1 నుంచి గ్లోబల్ విలేజ్, ఆహూతుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. నంబర్ 1న ప్రారంభం కానున్న గ్లోబల్ విలేజ్ కోసం సర్వం సిద్ధమయినట్లు నిర్వాహకులు తెలిపారు. 27 దేశాలకు చెందిన పెలివియన్లు, 12,000 కల్చరల్ మరియు ఎంటర్టైన్మెంట్ సోస్ని నిర్వహించనున్నాయి. 1.6 మిలియన్ చదరపు మీటర్ల పార్క్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ ఎక్జిట్ 37 వద్ద సందర్శకుల కోసం సిద్ధంగా ఉంది. ఈ పార్క్‌లో 3,500కి పైగా ఔట్లెట్స్, వందలాది బొటిక్ షాప్స్, 23 రెస్టారెంట్స్ కేఫ్‌లు, 120 ఫుడ్ అండ్ బెవరేజ్ కియోస్క్‌లు సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి. ప్రతిరోజూ 20కి పైగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆర్టిఎ గ్లోబల్ విలేజ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపటి కార్యక్రమాల విషయానికొస్తే, సాయంత్రం 4.40 నిమిషాల నుంచి పలు కార్యక్రమాలు జరుగుతాయి. పెవిలియన్ షోస్ - అమెరికాస్, గ్లోబో షోస్ - గ్లోబో వెల్కమ్ - ఇగ్లీష్, బాలీవుడ్ షో - వివా బాలీవుడ్, స్టంట్ షో - మాన్స్టర్ స్టంట్ షో, గ్లోబో షోస్ - మిస్టర్ లయన్ ఫైండ్స్ ఎ వాయిస్ - ఇంగ్లీష్, హైలైట్ షోస్ - టాల్ టేల్స్ వంటివి రేపటి కార్యక్రమాల్లో ప్రత్యేకతలు. మెయిన్ కల్చరల్ స్టేజ్, స్టంట్ ఎరీనా తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. వీటిల్లో కొన్ని రిపీట్ షోస్ కూడా ఉంటాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..