దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాల్ విజేతలు వీళ్ళే
- October 31, 2017
తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ డ్రా విజేతల్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ డ్రాలో ఇద్దరు విజేతలు చెరో 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఇందులో జపాన్‌కి చెందిన 47 ఏళ్ళ యజునోబు యమద 255 సిరీస్‌లో 2024 టిక్కెట్ ద్వారా 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఈ బహుమతి గెల్చుకున్న రెండో జపనీయుడు కావడం గమనించదగ్గ విషయం. ఇది తనకు దుబాయ్‌లో రెండో ట్రిప్ అనీ, ఈ రెండో ట్రిప్ తనను ఇంతటి ధనవంతుడ్ని చేస్తుందనుకోలేదని యమద చెప్పారు. మరో లక్కీ విన్నర్ దుబాయ్‌లోని భారతీయుడు సంతోష్ విజయన్. 50 ఏళ్ళ సంతోష్ విజయన్ కూడా 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. దుబాయ్‌లో 27 ఏళ్ళుగా నివసిస్తున్న సంతోష్ విజయన్, అబుదాబీలోని ఓ సంస్థలో ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు పిల్లలకు తండ్రి. నవంబర్ 11న తాను 51వ పుట్టినరోజు జరుపుకోనున్నాననీ, ఇది తనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటానని విజయన్ చెప్పారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం