గ్లోబల్ విలేజ్‌లో నవంబర్ 1న ప్రత్యేక కార్యక్రమాలివే
- October 31, 2017
నవంబర్ 1 నుంచి గ్లోబల్ విలేజ్, ఆహూతుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. నంబర్ 1న ప్రారంభం కానున్న గ్లోబల్ విలేజ్ కోసం సర్వం సిద్ధమయినట్లు నిర్వాహకులు తెలిపారు. 27 దేశాలకు చెందిన పెలివియన్లు, 12,000 కల్చరల్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ సోస్‌ని నిర్వహించనున్నాయి. 1.6 మిలియన్ చదరపు మీటర్ల పార్క్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ ఎక్జిట్ 37 వద్ద సందర్శకుల కోసం సిద్ధంగా ఉంది. ఈ పార్క్‌లో 3,500కి పైగా ఔట్‌లెట్స్, వందలాది బొటిక్ షాప్స్, 23 రెస్టారెంట్స్ కేఫ్‌లు, 120 ఫుడ్ అండ్ బెవరేజ్ కియోస్క్‌లు సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి. ప్రతిరోజూ 20కి పైగా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆర్‌టిఎ గ్లోబల్ విలేజ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపటి కార్యక్రమాల విషయానికొస్తే, సాయంత్రం 4.40 నిమిషాల నుంచి పలు కార్యక్రమాలు జరుగుతాయి. పెవిలియన్ షోస్ - అమెరికాస్, గ్లోబో షోస్ - గ్లోబో వెల్‌కమ్ - ఇగ్లీష్, బాలీవుడ్ షో - వివా బాలీవుడ్, స్టంట్ షో - మాన్‌స్టర్ స్టంట్ షో, గ్లోబో షోస్ - మిస్టర్ లయన్ ఫైండ్స్ ఎ వాయిస్ - ఇంగ్లీష్, హైలైట్ షోస్ - టాల్ టేల్స్ వంటివి రేపటి కార్యక్రమాల్లో ప్రత్యేకతలు. మెయిన్ కల్చరల్ స్టేజ్, స్టంట్ ఎరీనా తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. వీటిల్లో కొన్ని రిపీట్ షోస్ కూడా ఉంటాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం