మహిళలు డ్రైవింగ్ చేస్తుంటే వీడియో తీయడం ఓ నేరం
- October 31, 2017
జెడ్డా : స్మార్ట్ ఫోన్ లు వినియోగంలోకి వచ్చిన తర్వాత సమాజంలో పలు వివాదాస్పద కేసులు సంఖ్య పెరుగుతుందని జస్టిస్ మంత్రిత్వ శాఖ నివేదించింది .ఈ కేసులలో 25 శాతం మేరకు పీనల్ కోర్ట్ న్యాయమూర్తులు విచక్షణతో వదిలివేశారు. ప్రతి ఆరు నెలల వ్యవధిలో ఈ తరహా కేసులు సగటున 220 కేసులు న్యాయస్థానానికి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లతో సోషల్ మీడియాను విచ్చలవిడిగా ఉపయోగించడం సర్వసాధారణమైపోయిందని తర్వాత ఆన్లైన్ లో ఆయా వీడియోలు మరియు ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా ప్రజల గోప్యతను ఉల్లంఘిస్తున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటారు.ఆ తరహా కేసులలో కొన్ని ఉదాహరణగా పేర్కొంటే , వాట్స్ అప్ లో ఇద్దరు మహిళలు ఒకరిని ఒకరు నిందించుకోవడంపై కోర్టు తీవ్రంగా పరిగణించి ఆ స్రీలు ఇద్దరకీ 10 కొరడా దెబ్బల శిక్ష విధించారు. మరొక వ్యక్తి వాట్స్ అప్ ద్వారా ప్రమాదకర సందేశాన్ని పంపడంపై ఆ మెసేజ్ అందుకొన్న వ్యక్తి కోర్టులో దావా వేశారు. మరోక వ్యక్తి నీ అసభ్యకరమైన ఫోటోలను అందరికి చూపిస్తానని ఒక మహిళను బెదిరించాడు. మరొక వ్యక్తి తన ఫోన్ మెమరీలో ఎన్నో అసభ్యకరమైన విషయాలను నిల్వ చేశాడు. తారహమ్ కమిటీ సభ్యుడు న్యాయ సలహాదారులు నిస్రీన్ అల్-గంది సోషల్ మీడియాలో ఒకరినొకరు నిందించుకునే కేసులు ఇటీవల అధికమైపోతున్నాయని తెలిపింది. సమాజంలో ప్రజలు ఈ చర్యలపై అవగాహన పెంచుకోవాలి. ఇటువంటి కేసులు తీవ్రమైన నేరాలుగా మారడం సహజమని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక కేసులలో సాక్షులకు బదులుగా వారి స్మార్ట్ ఫోన్లతో న్యాయస్థానంలోకి అడుగుపెడుతున్నారని అల్-గంది చెప్పారు. మహిళలు త్వరలోనే డ్రైవింగ్ చేయనున్నారని ఆ మహిళల ఫోన్ల ద్వారా వీడియోలు వారి అనుమతి లేకుండా తీయడం మరియు ఫోటోలు తీయకూడదని హెచ్చరించారు. వారి గోప్యతను ఉల్లంఘన చేసే ఏ చర్యను సహించబోమని అది చట్టపరమైన నేరం కాగా మహిళలు కారు డ్రైవింగ్ చేస్తున్న వీడియోలను తయారుచేసి వారిని బాధించడానికి కారకులపై కఠినమైన శిక్ష ఎదుర్కొనవచ్చని అల్ గండి హెచ్చరించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం