ఫోన్ కుంభకోణంని చేధించిన దుబాయ్ పోలీసులు : 40 మంది ముఠా సభ్యులు అరెస్టు
- November 01, 2017
దుబాయ్: " హలో మీ మొబైల్ నెంబర్ కు లాటరీ వచ్చిందని " ఫోన్ల మీద ప్రజలను మాయమాటలతో వంచించి తాని తాము టెలికమ్యూనికేషన్ కంపెనీ ఉద్యోగులుగా చెప్పుకొంటూ పలు మోసాలకు పాల్పడే 40 మంది సభ్యుల గల మోసగాళ్ల బృందంని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మీకు 200,000 ధిర్హాంల బహుమతి వచ్చిందని , వాటిని పొందడానికి 2000 ధిర్హాంల డబ్బు ఖర్చు అవుతుందని ఆ మొత్తాన్ని మార్పిడి కేంద్రంలో తాముచెప్పిన అకౌంట్ కు పంపాలని అమాయక ప్రజలకు సూచిస్తారు. ఆ విధంగా డబ్బు సంపాదించే ఘరానా ముఠా గుట్టు దుబాయ్ పోలీసులు రట్టు చేశారు. ఆసియా దేశాలకు చెందిన 40 మంది సభ్యుల బృందం ఫరీజ్ అల్ ముర్ర్ ప్రాంతంలో రెండు ఫ్లాట్లను అద్దెకు తీసుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతుందని గుర్తించి పోలీసులు వారిని అరెస్టు చేశారు. దుబాయ్ పోలీసుల వ్యతిరేక ఆర్థిక నేరాల డిప్యూటీ డైరెక్టర్ కొలోన్ ఓమర్ బిన్ హమద్ మాట్లాడుతూ, రెండు ఫ్లాట్లను కొన్ని రోజులుగా తాము పరిశీలిస్తున్నామని కొందరు పురుషుల బృందం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టులలో అనుమానాస్పదంగా ఈ ఫ్లాట్ లలో సంచరిస్తున్నారని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి చట్టబద్దమైన అనుమతి పొందిన తరువాత, దుబాయ్ పోలీసులు అకస్మాత్తుగా ఆ ఫ్లాట్ లపై దాడి చేశారు. ఈ దాడిలో వారి వద్ద 90 ఫోన్లు దొరికినట్లు హమాద్ చెప్పారు. వారు వేర్వేరు ఫోన్ నంబర్లతో 110 లైన్లు వాడుతున్నారు. వారి వద్ద 60,000 ధిర్హాంల నగదుని సైతం స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. అనుమానితులు సాగించిన వ్యక్తులపై సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కు సున్నాకు ఉపయోగించారు. వీరిలో ఎక్కువమంది సందర్శన వీసాలో వచ్చి ఈ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు.వారిలో కొందరు అరబిక్ మాట్లాడుతున్నట్లు కనుగొన్నారు. వీరినందరిని అరెస్ట్ చేసి దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు పంపినట్లు ఆయన తెలిపారు. .
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం