రసాయనాల ఘాటు: 55 మందికి అనారోగ్యం
- November 01, 2017
షార్జా: షార్జాలోని ఓ ప్లాంట్‌లో రసాయనాల ఘాటు కారణంగా 55 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బీయా ఈ ప్లాంట్‌ని నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. ప్లాంట్‌కి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. తెల్లవారుఝామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 55 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేయగా, ఒకరు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కువైట్ హాస్పిటల్ ఎమర్జన్సీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఐసా అల్ మోవాలమి మాట్లాడుతూ, 12 మంది భారతీయులు, ఒక పాకిస్తానీ, ముగ్గురు నేపాలీ కార్మికుల్ని ఆసుపత్రికి తీసుకువచ్చారనీ, వారిని డిశ్చార్జ్ చేశామని చెప్పారు. గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, అలాగే శ్వాస పీల్చడంలో ఇబ్బందులతో వారు ఆసుపత్రికి వచ్చినట్లు అల్ మోవాలమి చెప్పారు. కెమికల్స్‌ని మిక్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







