దుబాయ్ గ్లోబల్ విలేజ్: ఫ్రీ టిక్కెట్స్
- November 01, 2017
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహింపబడ్తోన్న గ్లోబల్ విలేజ్ ఈవెంట్‌కి సంబంధించి సందర్శకుల్లో కొందరికి ఆశ్చర్యపోయేలా ఉచితంగా టిక్కెట్లు లభించాయి. 50 దిర్హామ్‌లతో సిరియాకి చెందిన ఓ వ్యక్తి టిక్కెట్ కౌంటర్ వద్ద నిల్చోగా, 'ఉచితంగానే మీకు ప్రవేశం లభిస్తుంది' అని కౌంటర్ సిబ్బంది సమాచారమివ్వడంతో షాక్‌కి గురయ్యారాయన. అలాగే పలువురికి ఉచిత టిక్కెట్స్ లభించాయి. ఈ సర్‌ప్రైజ్ తనకు చాలా ఆనందాన్నిచ్చిందని ఆయన చెప్పారు. ఫ్రీ టిక్కెట్స్ అందుకున్నవారందరి పరిస్థితీ ఇలాగే ఉంది. గ్లోబల్ విలేజ్‌లో ఫుడ్, యాక్సెసరీస్, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయని సందర్శకులు చెబుతున్నారు. గ్లోబల్ విలేజ్ కోసం కొత్త బస్ రూట్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రూట్స్‌లో బస్ సర్వీసులు సందర్శకులకు విశేషమైన సేవలందిస్తున్నాయి. జిసిసి దేశాల నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా గ్లోబల్ విలేజ్ ఈవెంట్ కోసం పెద్దయెత్తున సందర్శకులు వస్తున్నారు. రికార్డు స్థాయిలో ఈ సారి సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







