ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ ఎన్టీపీసీలో బాయిలర్ పేలి 20 మంది మృతి
- November 02, 2017
ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ నియోజకవర్గంలోని ఉన్చాహర్ ఎన్టీపీసీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి పెరిగింది. బాయిలర్‌లో జరిగిన పేలుడు ఘటన వీరిని బలితీసుకుంది. 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది ప్రాణాలు కోల్పోగా... మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు కారణంగా దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలిగింది.
అటు... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు ఎస్పీ శివ్‌హరి మీనా తెలిపారు. కాగా, మూడు రోజుల అధికార పర్యటనకు మారిషస్ వెళ్లిన యోగి ఆదిత్యనాథ్ ఎన్టీపీసీ పేలుడు సమాచారం తెలియగానే తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు.
మరోవైపు, రాయ్‌బరేలీ ఎన్టీపీసీలో పేలుడు దుర్ఘటనలో 20 మంది మృతి చెందడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసహాయం అందజేయాలని అధికారులను సోనియాగాంధీ కోరారు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!







