ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ ఎన్టీపీసీలో బాయిలర్ పేలి 20 మంది మృతి

- November 02, 2017 , by Maagulf
ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ ఎన్టీపీసీలో బాయిలర్ పేలి 20 మంది మృతి

ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ నియోజకవర్గంలోని ఉన్‌చాహర్ ఎన్టీపీసీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి పెరిగింది. బాయిలర్‌లో జరిగిన పేలుడు ఘటన వీరిని బలితీసుకుంది. 500 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌లో బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది ప్రాణాలు కోల్పోగా... మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు కారణంగా దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలిగింది. 
అటు... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు ఎస్‌పీ శివ్‌హరి మీనా తెలిపారు. కాగా, మూడు రోజుల అధికార పర్యటనకు మారిషస్ వెళ్లిన యోగి ఆదిత్యనాథ్ ఎన్టీపీసీ పేలుడు సమాచారం తెలియగానే తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు. 
మరోవైపు, రాయ్‌బరేలీ ఎన్టీపీసీలో పేలుడు దుర్ఘటనలో 20 మంది మృతి చెందడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసహాయం అందజేయాలని అధికారులను సోనియాగాంధీ కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com