10 వేల సోషియల్ మీడియా అకౌంట్లు మూసివేసిన దుబాయ్ పోలీసులు

- November 02, 2017 , by Maagulf
10 వేల సోషియల్ మీడియా అకౌంట్లు మూసివేసిన దుబాయ్ పోలీసులు

దుబాయ్: ' కొండ నాలికను మందు వేస్తే ...ఉన్న నాలిక ఊడి పోయిందని ' సోషల్ మీడియా ద్వారా పలు నేరాల సంఖ్య అధికమవుతుండడంపై దుబాయ్ పోలీసులు 10 వేల సోషల్ మీడియా అకౌంట్లు మూసివేశారు   దుబాయ్‌లోని ప్రభుత్వ సంస్థలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎమిరేట్స్, యూనియన్ కోఆపరేటివ్ సోసైటీ, జువైనల్ అవేర్‌నెస్ అండ్ కేర్ అసోషియేషన్, స్పోర్ట్స్ క్లబ్స్ అండ్ సోషల్ క్లబ్స్ ఆఫ్ ఫారెన్ కమ్యూనిటీస్ అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సైబర్ నేరాల గురించి అవగాహన సామాజిక మాధ్యమాలలో  జాగ్రత్తలు పాటించవలసిన విధానాలను తెలిపారు. ముఖ్యంగా కొత్త వ్యక్తులను ఏమాత్రం నమ్మవద్దని, అలాంటివారితో స్నేహాలకు దూరంగా ఉండడం మంచిదని సూచించారు. ఈ సందర్భంగా 2017 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వివిధ నేరాలకు కారణమైన, సంబంధమున్న దాదాపు 10,000 సోషల్ మీడియా అకౌంట్లను మూసివేశారు. ప్రజలు సైబర్ నేరాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ చర్య చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ అవగాహాన కార్యక్రమంలో దుబాయ్ నగర అధికారులు మహమ్మద్ అఖ్వీల్ అహ్లీ, బుట్టీ మ్మద్ బిన్ దర్విష్, ఘయా సుల్తాన్ అల్ ముహిరి పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com