హాలీవుడ్ లో సత్తా చాటనున్న ధనుష్
- November 02, 2017
అందం అంతగా లేకపోయినా.. బక్క పలచగా వున్నా.. హీరోగా ఎంట్రీ ఇచ్చి.. కొలవెరి సాంగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన కోలీవుడ్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రస్తుతం హాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్ నుండి ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే వంటి అగ్రతారలు హాలీవుడ్లో నటిస్తున్నారు. ఇంకా బాలీవుడ్ తారలు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, ఇర్ఫాన్ ఖాన్ వంటి నటులందరూ హాలీవుడ్లో సహాయ పాత్రల్లో నటించారు.
అయితే తమిళ నటుడైన ధనుష్ మాత్రం తన మొదటి హాలీవుడ్ చిత్రం ద్వారానే హీరోగా పరిచయం కాబోతున్నారు. 'ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్' చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ మంగళవారం విడుదలైంది. తల్లి మృతి చెందాక తండ్రి కోసం వెతుకుతూ దేశాలు తిరిగే పాత్రలో ధనుష్ కనిపించబోతున్నట్లు సమాచారం.
రొమైన్ ప్యూర్తొలా రాసిన 'ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్రోబ్' పుస్తకం ఆధారంగా దర్శకుడు కెన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా భారత్, యూరప్, హాలీవుడ్‌లను ఏకం చేసే సినిమాగా ఇది నిలుస్తుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..